తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు, చింతల పాలెం గ్రామాలలో జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు గురువారం బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఐదవ తరగతి పూర్తి అయి 6వ తరగతి కి వస్తున్న విద్యార్థులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, మౌళిక వసతులను వివరించారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్బా రావు, ఉపాధ్యాయులు బ్రహ్మయ్య, కరీం, సింగా రెడ్డి, ఆంజనేయులు, రవి ప్రసాద్ రెడ్డి, సుభాషిణి, స్వరూపా రాణి, చంద్రయ్య, లతిత, పొల బాబు, శైలజ లు పాల్గొన్నారు.
బొద్దికూరపాడులో బడి పిలుస్తుంది నిర్వహణ
23
Apr