పంట వ్యర్థాలను తగుల బెట్ట వద్దని భూమిలో కలియదున్నాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. కొత్తపాలెంలో వ్యర్థాలను తగుల బెట్టిన పొలాలను ఆయన శుక్రవారం సందర్శించారు. వ్యర్ధాలను కలియదున్నినట్లయితే కర్బనం పెరిగి నేల ఆరోగ్యవంతమవుతుందని చెప్పారు. పంటలు అన్నియూ కోత, నూర్పిడి దశలో ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఏదైనా పొరపాటు జరిగితే ఆరుగాలం కష్టపడి పండించిన పంటలతో పాటు విలువైన డ్రిప్, వ్యవసాయ పైపులు సైతం దగ్ధం అవుతాయన్న విషయాలను వివరించారు. విఏఏ సాయి, రైతులు పాల్గొన్నారు.
