దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టిన రోజు వేడుకలకు తాళ్లూరు మండల టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సోమవారం దర్శిలోని ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి నివాసానికి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. గొట్టిపాటి లక్ష్మ, లలిత్ సాగర్ దంపతులను గజమాలతో సత్క రించి ఆయురారోగ్యాలతో, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని టీడీపీ శ్రేణులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.దర్శి తరలి వెళ్లిశుభాకాంక్షలు తెలిపిన వారిలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, బి.ఓబుల్ రెడ్డి, టీడీపీ నేతలుమానం శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, నాటక అకాడమి డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి నేతలుమానం రమేష్ బాబు, పిన్నిక రమేష్ బాబు, గొల్లపూడి వేణుబాబు, షేక్ కాలేషావలి, చెన్నపు రెడ్డి వీరనాగిరెడ్డి, కె.రామకోటిరెడ్డి, కె.రామయ్య , రాచకొండ వెంకట్రావు, విద్యాసాగర్, నారిపెద్ది కళ్యాణ్, బి.హనుమారెడ్డి, పాలంఅంజిరెడ్డి, తిరుపతిస్వామి, కె.పేరిరెడ్డి, నాదెండ్ల శ్రీను, కె.పేరిరెడ్డి, మారం వెంకటరెడ్డి ,షేక్ అన్వర్ భాష,,సోము శ్రీనివాసరెడ్డి, పి.రమణా రెడ్డి,తది తరులు పాల్గొన్నారు.



గుంటిగంగవద్ద వృద్ధాశ్రమంలో గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు
తాళ్లూరు మండలంలోని గుంటిగంగ వద్ద తేజా వృదాశ్రమం నందు సోమవారం మండల
గుంటి గంగవద్ద వృద్ధాశ్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు మండలంలోని గుంటిగంగ వద్ద తేజా వృద్ధాశ్రమం నందు సోమవారం మండల వైన్స్ షాపుల అసోషియోషన్ ఆధ్వర్వంలో దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్నదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా గంగాభవాని ఆలయంలో గొట్టి పాటి లక్ష్మి పేరిట పూజలు చేయించారు. వృద్ధాశ్రమంలో టీడీపీ నేతలు గోపిరెడ్డి వెం కటేశ్వరరెడ్డి (చందన) ఎన్ వెంకటేశ్వరరావులు కేక్ కట్ చేసి వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదానకార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో సానె ఆంజనేయులు, సూర్యనారాయణ, జి.సుబ్బారెడ్డి, ఇమ్మానియేల్, నాగేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.


అంబరాన్ని అంటిన గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలు
దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి కార్యాలయం వద్ద కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా దర్శి టిడిపి ఇంచార్జ్ పుట్టిన రోజు వేదుకలు ఘనంగా నిర్వహించారు.
మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు భారీ కేక్ కట్ చేసి, గజమాలతో దర్శి నియోజకవర్గం లోని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులుఘనంగాసత్కరించారు.ఈ సందర్బంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ …… దర్శి నియోజకవర్గ ప్రజలారా నా కుటుంబ సభ్యులారా అక్కలారా చెల్లెల్లారా… పెద్దల్లారా మీరు చూపుతున్న ఆధార అభిమానాలను నేను ఎన్నటికీ మర్చిపోలేను అన్నారు.
మీ ప్రేమ ఆప్యాయత మరువరానిది మీరు నన్ను మీ ఇంటి ఆడబిడ్డ వలె గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే నా జన్మదిన రోజున చూపుతున్న ప్రేమ అభిమానం అపూర్వమైనవి . దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా మీ అభిమానం చూస్తుంటే నేను ఓడిపోలేదు నేను గెలిచాను మీ హృదయాలలో గెలిచాను అని ఆనందపడుతున్నాను. నేను దర్శిలో గెలుస్తాను మిమ్మల్ని గెలిపిస్తాను మీకు అభివృద్ధి ఏమిటో చూపిస్తాను. ఇప్పటికే చూశారు రెండేళ్ల కూటమిపాలనలో దర్శి ప్రజలతో నా ప్రయాణం అభివృద్ధి ఎజెండాగా కులమతాలకతీతంగా ముందుకు సాగుతున్నాను. ఊరురా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో పడుతున్న కష్టం చూస్తున్నాం. అదే స్ఫూర్తితో నేను మీకు సేవకురాలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకు చేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఒకటవ తేదీ ఇంటింటికి వెళుతున్నాం పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అందించే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, తాగు సాగునీటి వసతి, దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యం తో మనం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాము. మీరు చూస్తున్నారు రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి తప్ప అరాచకం విధ్వంసం లేకుండా ప్రశాంతమైన దర్శిని మనం చూడగలుగుతున్నాం. నేను వారంలో ఐదు రోజులు మీతో ఉంటున్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను ప్రజాసేవ చేస్తున్నాను దర్శి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉంటాను ప్రజలతో తిరుగుతాను ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను లేదంటే సచివాలయానికి వెళతాను మంత్రులను, అధికారులను కలుస్తాను. ఏ పథకం ద్వారా మనకు మేలు జరుగుతుందని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి సాధిస్తాను. అలా దర్శి నియోజకవర్గంలో అనేక ప్రాజెక్టులను మనం ముందుకు తీసుకు వెళ్ళగలిగాం. మన కూటమి పాలనలో 10 కోట్లతో మొగిలిగుండం ప్రాజెక్టును తాళ్లూరు ప్రాంతానికి అందజేయగలిగాం. అదేవిధంగా శాశ్వత తాగునీటి అవసరాలు తెచ్చే అమృత పథకం త్వరలో దర్శిలో ప్రారంభం కాబోతుంది. ఎలాంటి లో వోల్టేజీ సమస్యలు లేకుండా తాళ్లూరులో, ఉల్లగల్లులో, కురిచేడులో దాదాపు 20 కోట్లతో సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు సోలార్ ప్రాజెక్టులను తీసుకువచ్చాము. దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు దాదాపు 5 కోట్లు ఖర్చు చేశాం. గ్రామీణ రోడ్లకు దాదాపు 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఐదు కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లను నిర్మించుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి పర్యటనలో ఇచ్చిన హామీలను ముందుకు తీసుకు వెళ్ళాం. తూర్పు వీరాయపాలెం లో పట్టాల పంపిణీ, రోడ్ల అభివృద్ధికి కృషి చేశాం. దర్శిలో మినీ స్టేడియం నిర్మాణం ఒక వరంగా చెప్పవచ్చు. టిటిడి కళ్యాణ మండప నిర్మాణం చక చక జరుగుతున్న విషయం మీరు చూస్తున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించుకున్నాం. డిగ్రీ కళాశాల పక్కా భవనాలకు మార్గం సుగమనమైంది. ఆర్టీసీ డిపో నిర్మాణానికి కృషి చేస్తున్నాం. దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. మూడు కోట్లతో ఎన్ఎస్పి లైనింగ్ పనులను చేపట్టబోతున్నాం. దాదాపు నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా ఈ రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు. దాదాపు పది కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఘనత మన అందరిది. నిత్యం మీతో ఉంటున్నాను మీ సమస్యలు తెలుసుకుంటున్నాను. మీ అండగా నిలుస్తున్నాను. దర్శి ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేయాలన్న లక్ష్యంతో వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నిరంతరం నేను ఆలోచన చేస్తున్నాను. యువతకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండేళ్ల కూటమిపాలనలో జరుగుతుంది. మీరు గతంలో ఐదేళ్లు వైసిపి పాలను చూశారు ఏం చేశారు వర్గవైశ్యమ్యాలు, కుల మతాలు, విధ్వంసాలు, ప్రజలపై దాడులు అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మన కూటమిపాలనలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నామని సగర్వంగా చెబుతున్నాను. అభివృద్ధి ఎజెండాగా వెళుతున్నము. మనకూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి, దీవించండి నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా భావించి నా అండగా నిలబడండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేదం కలిసికట్టుగా ముందుకు వెళదాం. గతా అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తప్పిదాన్ని సరి చేసుకుందాం తెలుగుదేశానికి బలమైన దర్శి నియోజకవర్గంలో జెండా ఎగర వేద్దాం తెలుగుదేశం అడ్డా అని నిరూపిద్దాం. ఇక్కడ నాయకులు కార్యకర్తలు బలమైన వారు దర్శి లో పార్టీ చాలా బలంగా ఉంది మనం మనకు మనం బలహీనం చేసుకోవద్దు కలిసికట్టుగా ముందుకు వెళదాం. స్థానిక సంస్థల్లో మన సత్తా చాటుదాం. ఈ సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాను. కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య, మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మహిళలు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరైన టిడిపి, కూటమి శ్రేణులు. కోలాహాలంగా డాక్టర్ లక్ష్మీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
