తాళ్లూరు మండలం లోని నాగంబొట్ల పాలెం రైతులకు చెందిన పొలాలలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను దుండగులను పగుల కొట్టి అపహరించారు. అయ్యల వారి పాలెం దారిలోని బొద్దికూరపాడు ఫీడర్ పరధిలో నూతన బై పాస్ ప్రక్కన ఉన్న వెంకట రెడ్డి, నగేష్, పిచ్చి రెడ్డి, సోము వెంకట నరసింహా రెడ్డిలకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్ ల ను దుండగులు పగుల కొట్టారు. శుక్రవారం ఉదయం రైతులు పొలాల వద్దకు వెళ్లి గమనించగా ట్రాన్స్ఫార్మర్ శిధిలాలు ఉన్నాయి. లోన ఉన్న రాగి తీగను ఎత్తుకెళ్లారు. దీంతో రైతులు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు.

