ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరండి బంగారు భవిష్యత్తు సాకారం చేసుకోండని సాంఘిక సంక్షేమ వెల్ఫేర్ అసిస్టెంట్ వై. మేరీ లత తెలియజేశారు.మంగళవారం నాగులుప్పలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ లోసాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చేరే విద్యార్థుల అడ్మిషన్ల కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగామేరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు హాస్టల్ వసతి కూడా అందజేస్తుందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరవ తరగతిలో చేరబోయే విద్యార్థులును గుర్తించి వారిని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేరేలా వారికి అవగాహన కల్పించారు. హాస్టల్లో అందిస్తున్న మెను గురించి వార్డెన్ లింగయ్య వివరించారు. క్రమశిక్షణ సంపూర్ణ ఆరోగ్యం మంచి పోషకాహారాలను అందజేస్తామని తెలియజేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివిన విద్యార్థులు పదో తరగతిలో 500 మార్కులకు కన్నా ఎక్కువ మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మారెళ్ళ శేషయ్య గ్రామ పెద్దలు ముంగర సుబ్బారావు ,దోనంపూడి సుబ్బరాయుడు , పసుమర్తి.విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
