కిషోర వికాసానికి సమిష్టిగా ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని వక్తలు అన్నారు. తాళ్లూరుమండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో మంగళవారం మండల స్థాయి అధికారులు కిషోర వికాసం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ పి అజిత, తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎపీఎం దేవ రాజ్, జిల్లా కోఆర్డినేటర్ వీరాంజనేయులు, ఐసీడీఎన్ నూపర్ వైజర్ సునీత పాల్గొని ఆయా గ్రామాలలో కిషోర వికాసం కోసం ఏర్పడిన కమిటీలు చేస్నున్న కృషిని సమీక్షించారు. బాల్య వివాహాలపై, చట్టాలపై అవగాహన కల్పించాలని, డ్రాప్ అవుట్‌ను తగ్గించే విధంగా మరింత కృషి చెయ్యాలని కోరారు. అరోగ్య, ఆంగన్ వాడీ, ఆశ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
