బేగంపేట, మే 19, (జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎండి నసీర్ (అడ్డు) ను నగర కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి (బేగంపేట)రమేష్ మంగళవారం అల్లంతోట బాయిలోని తన కార్యాలయంలో ఘనంగా నసీర్ ను సన్మానించారు.ఈ సందర్భంగా గౌరపల్లి నూతన అధ్యక్షుడు నసీర్ కు పలు సూచనలు చేశారు.కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో పటిష్ఠానికి కృషి చేయాలని, కష్టపడిన కార్యకర్తలకు సమచిత స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం పార్టీ అప్పగించిన బాధ్యతగా తీసుకుని పార్టీ ప్రతిష్ట పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి సంజీవ, ఆయూబ్ ,సిద్ధిఖీ, దర్గా కరుణాకర్ ,శ్రీకాంత్,రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.

