మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు …ఓ స్త్రీ గౌరవాన్ని నిలిపిన కామాఠిపురా సి ఐ ప్రసాదరావు.

హైదరాబాద్ మే 20, (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగర పరిధిలోని కామాటి పురా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి సమయంలో ఓ మహిళ వంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా సంచరించడాన్ని గమనించిన ఇన్స్ పెక్టర్ బి.ప్రసాదరావు చలించిపోయారు.సమీపంలో ఎలాంటి బట్టల షాపులు లేకపోవడం గమనించి వెంటనే పోలీస్ యూనిఫారం చొక్కా,పంచె ధరింపజేసి మహిళ గౌరవాన్ని కాపాడారు.రాత్రి సమయం,ఒంటరి మహిళ అదీ వంటిపై నూలు పోగు లేకుండా రోడ్డుపై సంచరిస్తుంటే పరిస్తితి ఎలా ఉంటుందో తలచు కుంటెనే ఆందోళనగా ఉంటుంది.ఆ సమయంలో మహిళను గమనించిన ఇన్స్ పెక్టర్ ప్రసాదరావు వెంటనే తన యూనిఫారం చొక్కా,పంచె ఇచ్చి ఆమెకు ధరింపజేశారు. పాతబస్తీ బహదూర్ పురా ఎక్స్ రోడ్డు వద్ద మహిళ బట్టలు లేకుండా తిరుగుతుండటం,ఎవరూ పట్టించుకోకపోవడం తో సి ఐ రంగంలోకి దిగి ఆమెకు బట్టలు ధరింపజేసి తన మానవత్వాన్ని చాటడంతో పాటు పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచే లా చేశారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో ఆమెకు సమీపంలోని చెక్ పోస్టు వద్ద ఆశ్రయం కల్పించి అండగా నిలిచారు.ఇది గమనించిన వాహనదారులు ,స్థానికులు కామాఠిపుర పోలీసులను హాట్సాఫ్ కామాటి పురా పోలీస్ అంటూ అభినందిస్తున్నారు.సి ఐ ప్రసాద రావు సమయ స్ఫూర్తిని కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *