దర్శి తహసిల్దార్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రావణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది కలిసి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ .. టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, నిస్వార్థ ప్రజాసేవకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహానేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
