దర్యాప్తులో పక్కా నిఘా…..మానిటరింగ్ సెల్ తో పెరుగుతున్న కన్విక్షన్…..శాస్త్రీయ ఆధారాల సేకరణతో కోర్టుల్లో నిలబడుతున్న కేసులు…..బాధితులకు న్యాయం చేకూర్చేలాహైదరాబాద్ నగర పోలీసుల ప్రత్యేక శ్రద్ధ……హైదరాబాద్సి పి సజ్జనార్ .

హైదరాబాద్ జులై 11,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కేసుల దర్యాప్తులో సాంకేతికతను జోడించి, నేరస్థులకు చట్టపరంగా శిక్ష పడేలా చేయడంలో హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందనీ హైదరాబాద్ సి పి సజ్జనార్ అన్నారు. సాధారణంగా కేసు నమోదుతోనే బాధ్యత ముగిసిపోదన్న భావనతోబాధితులకు న్యాయంచేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ కేసుల దర్యాప్తు ప్రక్రియలో సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి దర్యాప్తును ఈ ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తుండటంతో, దర్యాప్తులో నాణ్య‌త‌తో పాటు న్యాయస్థానాల్లో కన్విక్షన్ రేటు క్రమంగా పెరుగుతోందన్నారు.
ఇటీవల సనత్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన బాలుడి హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో పాటు పలు కీలక కేసుల కన్విక్షన్లలో ఈ ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ కీలక పాత్ర పోషించింది. ప్రాథమిక దర్యాప్తు స్థాయి నుంచే కేసును నిశితంగా గమనిస్తూ, లూప్‌హోల్స్ లేకుండా పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించడం వల్లే కోర్టుల్లో నేరం రుజువై నిందితులకు కఠిన శిక్షలుప‌డుతున్నాయి. ముఖ్యంగా పోక్సో కేసులు, మహిళలు, చిన్నారులపై జరిగే కేసుల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ఈ సెల్ పెద్దపీట వేస్తోంది.
గతంలో తగినంత సమయం లేకపోవడం వల్లో, లేదా సాంకేతిక పరిజ్ఞానం కొరత వల్లో కొన్ని కేసుల
దర్యాప్తులో చిన్నపాటి లోపాలు దొర్లేవి. దీనివల్ల నిందితులు కోర్టుల నుంచి
సులువుగా తప్పించుకునేందుకు ఆస్కారం ఉండేది. ఈ సవాళ్లనుఅధిగమించడానికి రంగంలోకి దిగిన ‘మానిటరింగ్ సెల్’ ప్రతి కేసును
అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులతో కూడిన ఈ విభాగం క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఒక దిక్సూచిలానిలుస్తోందినిందితుల అరెస్ట్, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, సాక్షుల గుర్తింపు వంటి కీలక దశల్లో శాస్త్రీయ పద్ధతులను అవలంబించేలా ఈ సెల్ అడుగడుగునా సహాయపడుతుంది. నిర్దేశిత గడువు లోపలన్యాయస్థానాల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేసేలాపర్యవేక్షించడంతో పాటు, ప‌బ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ కోర్టు విచారణ సజావుగా సాగేలా చూస్తోంది.
ఈ మానిటరింగ్ సెల్ క్షేత్రస్థాయిలో తీసుకువచ్చిన మార్పులకు కన్విక్షన్ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. గడచిన కొన్ని నెలల రికార్డులను విశ్లేషిస్తే, గ్రేవ్ (తీవ్రమైన), నాన్-గ్రేవ్ (సాధారణ) కేసులలో నేర నిరూపణల శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఆరునెలల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్
కేసులన్నింటిలో కలిపి దాదాపు 2469 కేసులలోనిందితులకు కోర్టులు శిక్షలు ఖరారు చేశాయి. అందులో 20 ఏళ్లకు పైగా శిక్షలు 18 కేసుల్లో, జీవిత ఖైదులు 12 కేసుల్లో, ఒక కేసులో ఉరి శిక్షను కోర్టులు ఖరారు చేశాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ పర్యవేక్షణ మరింత పటిష్టం కావడంతో.. పోలీసుల దర్యాప్తు శైలిలో వచ్చిన మార్పులకు, పకడ్బందీ నిఘాకు ఇవి అద్దం పడుతున్నాయి.
మరోవైపు, దర్యాప్తు పూర్తయి కోర్టులో ట్రయల్ ప్రారంభమైన తర్వాత కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వీలుగా కోర్టు మానిటరింగ్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కోర్టుకు ఒక ప్రత్యేక లైజన్ ఆఫీసర్ ని నియమించింది. ఈ అధికారులు కోర్టుల్లో సాగుతున్న ట్రయల్స్ అన్నింటినీ ప్రతిరోజూ నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలను సకాలంలో సమర్పించడంతో పాటు, కీలక సాక్షులను సమయానికి కోర్టుకు హాజరుపరిచేలా వీరు సమన్వయం చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడే వరకు ప్రతి కేసును అత్యంత క్లోజ్‌గా మానిటర్ చేసే ఈ విధానం వల్ల నేర నిరూపణ శాతం గణనీయంగా పెరుగుతోంది.
ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల దర్యాప్తు ప్రక్రియలో జాప్యం తగ్గడంతో పాటు కేసుల పురోగతిలో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన నేరాల కేసుల్లో నిందితులు తప్పించుకోలేకుండా పటిష్టమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానాల ముందుకు వెళ్లే వీలు కలుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణలో నగర పోలీసుల సన్నద్ధత మరింతపెరుగుతోంది.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పందిస్తూ..బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయంజరిగినప్పుడే పోలీసింగ్ వ్యవస్థకు సార్థకతచేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ లక్ష్యసాధన కోసమే పనిచేస్తున్న ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ దర్యాప్తుఅధికారులకు ఒక బలమైన
వెన్నుదన్నుగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక శాస్త్రీయ ఆధారాలను మేళవించడం వల్లే కోర్టుల్లో నేర నిరూపణ సాధ్యమవుతుందని, ఈ సెల్ ద్వారా ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని వివరించారు. రాబోయే రోజుల్లో సాంకేతిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో నగర ప్రజలభాగస్వామ్యంతో మరింత పటిష్టంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *