సికింద్రాబాద్ (తిరుమలగిరి)ఆగస్ట్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతోతిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికెట్ (మారేడ్ పల్లి) కేవీ స్కూల్లో సోమవారం ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సునిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతానిబంధనలను విధిగా
పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాలవాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. అలాగే వాహనంనడిపేటప్పుడు మొబైల్ ఫోన్లుఉపయోగించకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. సిగ్నల్స్
పాటించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం ద్వారా ప్రాణనష్టాన్ని అరికట్టవచ్చని ఆయన సూచించారు.
ట్రాఫిక్ పోలీసుల ఈ నిర్ణయాన్ని కేవీ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ముకేష్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు కొనియాడారు. తామంతా బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఐ.వి. రమణయ్య, సబ్ ఇన్ స్పెక్టర్లు, పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

