కొండేపిలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం: PMAY పథకం కింద ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి- కొండేపి నియోజకవర్గానికి 229 ఇళ్లు మంజూరు….లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి డోలా..అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన: హౌసింగ్ పట్టాల పంపిణీలో మంత్రి బాల వీరాంజనేయస్వామి

కొండేపి మండల పరిధిలో ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి, మంజూరు పత్రాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి శోధనాత్మకంగా పంపిణీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొండేపి నియోజకవర్గంలో PMAY–OUDA 2.0 (BLC) పథకం కింద మొత్తం 229 నూతన గృహాలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో గ్రామాల వారీగా కొండేపి గ్రామానికి 68, పొన్నులూరు మండలం వేంపాదు గ్రామానికి 11, సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి 24 మరియు పాకల గ్రామానికి 45, టంగుటూరు మండలం టంగుటూరు గ్రామానికి 54, అలాగే జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట గ్రామానికి 27 గృహాలు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. మిగిలిన గ్రామాల్లో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే 10 రోజుల్లో మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

​ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, ఒక్కో గృహానికి యూనిట్ ఖర్చు ₹2,50,000 (పూర్తి సబ్సిడీ) అని, ఇందులో కేంద్ర ప్రభుత్వం సహాయం ₹1,50,000 (60%), రాష్ట్ర ప్రభుత్వం సహాయం ₹1,00,000 (40%) గా ఉందని తెలిపారు. ఈ 229 గృహాలకు సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ₹5.725 కోట్లు కాగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా ₹3.435 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹2.290 కోట్లుగా ఉందన్నారు.
​దీనికి అదనంగా కన్వర్జెన్స్ ప్రయోజనాల కింద MGNREGS ద్వారా 90 పని దినములకు ₹27,000, SBM (Gramin) ద్వారా IHHL కు ₹12,000 కలిపి మొత్తం ₹39,000 వరకు అదనపు సహాయం ఉడా (UDA) ప్రాంతాల్లో అందిస్తున్నామని, దీంతో ఒక్కో ఇంటికి మొత్తం యూనిట్ కాస్ట్ ₹2,89,000 (₹2.50 + ₹0.39 లక్షలు) అవుతుందని వివరించారు. నిర్మాణ దశల వారీగా లబ్ధిదారుల చెల్లింపులు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో జమ అవుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రాయితీలు ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్లకు కూడా తమ ప్రభుత్వం వచ్చాక నిధులు చెల్లించి అండగా నిలిచామని మంత్రి గుర్తుచేశారు.

​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరియు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఊరట కలిగిస్తోందని మంత్రి అన్నారు. కొండేపి ఆసుపత్రిని ఆధునీకరించి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు, కాన్పులు, ఆపరేషన్లు అందిస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, మంచినీటి సమస్య పరిష్కారానికి పైప్‌లైన్‌ల ఏర్పాటు, చిలకలగుంట మరియు జాళ్లపాలెం రోడ్డులో ₹100 కోట్లతో విద్యుత్ స్టేషన్ నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
​అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ. 6,000 వరకు పెన్షన్ల పంపిణీ, అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పంచాయతీ ఆఫీసుల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ, పేద విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా నిధుల జమ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ రాబోయే రోజుల్లో పూర్తి చేసి, ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పి. శ్రీనివాస ప్రసాద్, డి.ఈ సత్యనారాయణ, తహసిల్దార్ శ్రీనివాసరావు, అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు పాల్గొన్నారు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *