ఒంగోలు: ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరానికి 2027- 2028 లో 9 తరగతి మరియు 11వ తరగతి మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యుడు సి.శివరాం తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో లేక ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 8తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. ఆసక్తిగల వారు అక్టోబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సి. శివరాం తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: