మార్కాపురం : జర్నలిస్టులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్వి. రమణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి. సుబ్బారావు పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన మార్కాపురంలో శుక్రవారం జర్నలిస్ట్ డిమాండ్ డే కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు ప్రదర్శన గా స్థానిక ప్రెస్ క్లబ్ నుండి పాత బస్టాండ్ లోని గాంధీ పార్కు కు చేరుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వినతి పత్రాన్ని ఆ మహనీయుని చేతిలో పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ వి. రమణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా గత పది సంవత్సరాల కాలంలో మీడియా పైన, లౌకిక శక్తులపైన దాడులు తీవ్ర తరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం గా ఉన్న మీడియా స్తంభం మూలాలు దెబ్బతింటే అది దేశ పురోగతికి, ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర నష్టమని అని అన్నారు. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛలో భారతదేశం కనిష్ట స్థాయికి పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల వేతనాల మరియు, వృత్తి భద్రతకు సంబంధించి మజీదియ కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందించి దశాబ్దాలు గడుస్తూన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమైన చర్యని ఆయన అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వేతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికి నివాస స్థలాలను మంజూరు చేయాలని, అలాగే
జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు
హెల్తు ఇన్సూరెన్స్ పాలసీని అమలుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని,
జర్నలిస్టులకు గతంలో ఉన్న విధంగా రైల్వేలో 50% ప్రయాణ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్ వి. రమణ పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాస రావు,మాజీ ఐజేయు సభ్యులు జి ఎల్ నరసింహా రావు, కోశాధికారి డి బాబీ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె. బాజీవలి, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కె.అన్నూ,జి. రమేష్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పి.ఓబయ్య,నాయకులు వేసపోగు రాజు, వి.వాసు, పవన్ ,ఎస్ కె. బషీర్,బి. మల్లికార్జున, సురేష్, ఆవుల వెంకట్,
శేఖర్,నరేంద్ర,జి. మల్లికార్జున రెడ్డి, గుమ్మా అంకయ్య,ఏ.కృష్ణయ్య గౌడ్, ఎస్ కె కరీం, థామస్, వై.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: