ఒంగోలు: ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం లో సోమవారం మోడల్ యూత్ గ్రామసభ కార్యక్రమం జరిగింది. మోడల్ యూత్ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులు 19వ వార్డు మాజీ కార్పొరేటర్ ఈదర చిన్నారి, విద్యాలయా ప్రిన్సిపల్ సి.శివరాం, సీనియర్ టీచర్ యన్.తాతయ్య జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం ముఖ్య అతిథి ఈదర చిన్నారి మాట్లాడుతూ నవోదయ విద్యాలయంలో మోడల్ యూత్ గ్రామసభను ఘనంగా నిర్వహించడం వల్ల విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ గ్రామ సభ వల్ల గ్రామంలో జరిగే పలు కార్యక్రమాలను విద్యార్థులు గ్రామ సభ యొక్క విధి విధానాలను సభలో ఉండే ప్రతి ఒక్క పాత్రను వారు నిర్వహించే విధి విధానాలను తిలకించి ఆనందించి అభినందించారు. ఇలాంటి గ్రామసభలు విద్యార్థుల్లో గ్రామాల్లో జరిగే ఎటువంటి పలు కార్యక్రమాలను తెలుసుకోవచ్చన్నారు.
గ్రామ సభ అనేది పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న గ్రామస్థులందరితో కూడిన ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అని చెప్పవచ్చు అని తెలిపారు.
విద్యాలయ ప్రిన్సిపల్ సి.శివరాం మాట్లాడుతూ పీఎం శ్రీ ఆక్టివిటీ భాగంగా విద్యాలయం నందు మోడల్ యూత్ గ్రామసభని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యాలయ 10వ తరగతి చదువుతున్న విద్యార్థి జయదీప్ సర్పంచ్ పాత్ర పోషించారు. ఈ గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామ సభ ముఖ్యమైన విధులను విధి విధానాలను అందరికి తెలిపారు.
గ్రామాభివృద్ధి, గ్రామానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను చర్చించారు.
బడ్జెట్ పరిశీలన,
జవాబుదారీతనం, పలు విషయాలను గ్రామ సభలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు పలు విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో యన్.తాతయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: