తాళ్లూరు: డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కెనరా బ్యాంకు ఆర్ధిక అక్షరాస్యత కౌల్సిలర్ (పైనాన్షియల్ లిటరసీ కౌల్సిలర్ ) సీహెచ్ సాయి కుమార్ కోరారు. డిబి ఆర్ సీ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్సీ కాలనీలో డిజిటల్, ఆర్ధిక అక్షరాన్యతపై అవగాహన నదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో పొదుపు, బ్యాంకు అందిస్తున్న సేవలు లావాదేవీలపై పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. యూపీఐ, ఎటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నేట్ బ్యాంకింగ్, సురక్షిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. సైబర్, డిజిటల్, ఆర్థిక మోసాలు పోకుండా సురక్షితంగా కష్టపడిన సొమ్మును భద్రపరుచుకోవాలని సూచించారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు, గ్రామ పెద్దలు కూకట్ల శ్రీనివాస రావు, దాసరి వెంకయ్య, బి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: