స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ దిశగా జిల్లాల యంత్రాంగం సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, జెడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు మమ్మురం చేసామన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి సామాగ్రి వచ్చిందని, జిల్లాస్థాయిలో అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు టెండర్లను పిలిచామని చెప్పారు. ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన కల్పించేలా మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *