దర్శి : అభ్యుదయ కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, చిత్రకారుడు, చలనచిత్ర సాంస్కృతిక దర్శకుడు అడివి బాపిరాజు జయంతి వేడుకలను గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పి. రంగారావు అధ్యక్షత న కార్యక్రమం నిర్వహించారు . విశ్రాంత మండల విద్యాశాఖాధికారి కాకర్ల రఘురామయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు , మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ శర్మ, నారపుశెట్టి చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ అడివి బాపిరాజు త్యాగాలను వివరిస్తూ, తాను ఈ పాఠశాలలో చదివిన నాటి చిన్ననాటి విద్యాభ్యాసం, అప్పటి పాఠశాల స్థితిగతులు, 1979-80లో పదో తరగతి పరీక్షా విధానం గురించి విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రసంగించారు.

కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బాపిరాజు దేశానికి ఎనలేని సేవ చేసిన మహనీయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ శర్మ, నారపుశెట్టి చైతన్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: