దర్శి: దర్శికి డిగ్రీ కళాశాల భవనాలను మంజూరు చేసినందుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్లుగా భవనాలు లేక డిగ్రీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మంత్రిగా దర్శి విద్యాభివృద్ధికి సహకరించడం మరచిపోలేమని తెలిపారు. అదేవిధంగా పీపీపీ విధానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో దర్శిలో క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేస్తున్నట్లు లోకేష్ కు వివరించగా, ఆయన శభాష్ అంటూ అభినందించారన్నారు. డిగ్రీ కళాశాల భవనాలు, క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవాలకు దర్శికి రావాలని ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం కేంద్ర కార్యాలయంలో పార్టీ క్యాడర్ కు శిక్షణ ఇచ్చిన డాక్టర్ లక్ష్మీ తదితరులను లోకేష్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: