మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ – సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్) సభ్యురాలిగా నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బూచేపల్లి వెంకాయమ్మను సీఈసీ మెంబర్ గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బూచేపల్లి వెంకాయమ్మను సీఈసీ మెంబర్ గా నియమించడంతో బూచేపల్లి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ హోదాలో పార్టీ సమావేశాల్లో పాల్గొనడం, సంస్థాగత బలోపేతానికి సూచనలు ఇవ్వడం, స్థానిక ప్రజా సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడం, పార్టీ నిర్ణయాలు–కార్యక్రమాల అమలుకు సహకరించడం వంటి పాత్ర ఉంటుంది.


Save or share this story as a newspaper-style Epaper Clip: