దుర్గామాత మండపాల నిర్వాహకులతో మహంకాళి ఏసీపీ సమావేశం.

బేగంపేట అక్టోబర్ 8(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న దుర్గామాత పూజా మండపాల నిర్వాహకులతో మహంకాళి డివిజన్ ఏసీపీ శ్రీధర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్‌తో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు ఏసీపీ శ్రీధర్ సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవడం, విద్యుత్ భద్రత తదితర అంశాలపై పోలీసు అధికారులు నిర్వాహకులకు పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా నిర్వాహకులను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *