బేగంపేట అక్టోబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి దేవాలయంలో సోమవారం అమ్మవారు గాయత్రీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనము ఇచ్చారు.ప్రతి రోజు 5గంటలకు సుప్రభాతసేవ, గం 5.30నిలకు గోత్రనామాలతో ప్రత్యేక అభిషేకం. గం 6.30నిలకు అమ్మవారి దివ్యదర్శనం కుంకుమార్చన అర్చనలు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నైవేద్యం మంగళహారతి సాయంత్రం 5:30
నిమిషా లకు సామూహిక కుంకుమార్చనలు లలితా సహస్ర నామ పారాయణము. 6 45 నిమిషములకు అమ్మవారికి మహా నైవేద్యం, మంగళహారతి ఆశీర్వాదం అందించనున్నట్లు ఆలయ ఈవో చంద్రకళ, ఆలయ ధర్మకర్త విశాల్ సుధాం లు తెలియజేశారు. సోమవారం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: