బేగంపేట అక్టోబర్ 12 (జేఎస్ డి ఎం న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమీర్పేట శ్రీ కనకదుర్గ దేవీ ఆలయంలో సోమవారం అమ్మవారు బాల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మహిళా భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వంగ అంబుజా ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: