దర్శి:-దర్శి అభివృద్ధిలో కీలకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పనులను ప్రారంభించారు.
2014లో టీడీపీ ప్రభుత్వం దర్శిలో ఈ స్కూల్ ఏర్పాటుకు రూ.22 కోట్లు కేటాయించి రూ.2 కోట్లకు పైగా పనులు పూర్తి చేసిందని, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయని లక్ష్మీ తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని, తొలి విడతగా రూ.9 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు
రెండేళ్ల కూటమి పాలనలో దర్శి అభివృద్ధి పరుగులు తీస్తోందని, నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం, మినీ స్టేడియం, క్రికెట్ స్టేడియం, డిగ్రీ కళాశాల, కోల్డ్ స్టోరేజ్, టీటీడీ కల్యాణ మండపం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, రూ.20 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయని వివరించారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం ఎన్ సుబ్బా రావు , ఆర్&బీ డీఈ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: