మాజీ నర్పంచి పోశం నారాయణ రెడ్డి సేవలు మరువలేనివి – వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

తాళ్లూరు: బెల్లంకొండ వారి పాలెం మాజీ సర్పంచి పోశం నారాయణ రెడ్డి గ్రామ అభివృద్ధికి, పార్టీఅభ్యన్నతికి చేసిన సేవలు మరువలేనివని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. బెల్లం కొండ వారి పాలెంలో పోశం స్వగృహాంలో నిర్వహించిన ఆయన సంస్మరణ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హాజరై ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారులు పోశం వెంకట రమణా రెడ్డి ( యూ ఎస్ ఏ ), మాజీ ఎంపీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డిలను ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. నియోజక వర్గంలో అధిక సంఖ్యలో నాయకులు ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. జిల్లా పార్టీ కార్యదర్శి మారం ఇంధ్రసేనా రెడ్డి, పార్టీ మెధావులు సంఘ కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, బొద్దికూరపాడు మాజీ సర్పంచి పులి క్రిష్ణా రెడ్డి, కుమ్మిత శ్రీనివాస రెడ్డి, కుమ్మిత చిన నాగి రెడ్డి, దర్శి మండల వైసీపి అధ్యక్షుడు మహేష్, సోము దుర్గా రెడ్డి, గువ్వల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *