బేగంపేట అక్టోబర్ 17,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట లోని పాటిగడ్డ ఎన్ బీనగర్ బీ టీ నగర్ లో మహిళలతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బేగంపేట మాజీ కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి, టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు రాగ నాగరాజు గౌడ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు ఘనంగా చేశారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని వారితో కాలు కదుపుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తలసాని అభిమానులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టీ. మహేశ్వరీ శ్రీహరి,టిఆర్ఎస్ నాయకులు టీ. శ్రీహరి రాగా నాగరాజు గౌడ్,శ్రీనివాస్ గౌడ్ శేఖర్ ముదిరాజ్,పాటిగడ్డ గిరి,ఆరిఫ్,తదితరులు పాల్గొన్నారు.










Save or share this story as a newspaper-style Epaper Clip: