దర్శి : దర్శి పురపాలక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు ఓటమి భయంతోనే వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థిపై దాడి చేశారని ఇది హేయమైన చర్య అని జిల్లా వైసిపి అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం నామినేషన్లు పత్రాలతో 8 మంది కౌన్సిలర్లు చైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి నామినేషన్ వేసేందుకు నామినేషన్ కేంద్రాలకు వెళ్లే క్రమంలో టిడిపి గుండాలు అడ్డుకొని వారిపై దాడి చేశారని ఇది ప్రజాస్వామ్యయు తంగా మంచి పద్ధతి కాదని అన్నారు. ఎనిమిది మంది కౌన్సిలర్లు నామినేషన్ దాఖలు చేయగా ఆన్లైన్లో మూడు నామినేషన్ కనబరిచారని, వేసిన నామినేషన్లకు అదికారులు రసీదులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దర్శి పోలీసులు సహకారంతో టిడిపి గుండాల మా పై దాడి చేసారని అన్నారు. నామినేషన్ అడ్డుకున్న సంఘటనపై డిఎస్పీ బాలమురళీకృష్ణను సంప్రదించడం జరిగిందని .. వారు తన వెంట తీసుకొని వెళ్లి నామినేషన్లు వేయిస్తానని మాకు నమ్మకంగా చెప్పారని …… ఆయన మాటలను గౌరవించి వారి వెంట చైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి కౌన్సిలర్లను పంపించడం జరిగిందని…… నామినేషన్ కేంద్రానికి వెళ్లే లోపు టిడిపి మద్దతుదారులు గుండాలు మా వారిపై దాడి చేశారని…… ఇది ఎంతవరకు సమంజస మని పోలీసు వారు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు . మా అభ్యర్థులపై దాడి జరిగిన విషయమై జిల్లా ఎస్పీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు . నామినేషన్లకు ఒక రోజు మాత్రమే మిగిలిందని ఎన్నికల కమిషనర్ జోక్యంతో మా అభ్యర్థుల నామినేషన్లు వేసి విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్, మాజీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి ,వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, అంజయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ కేవీరెడ్డి , నాయకులు చింతా శ్రీనివాస్ రెడ్డి , శీలం శ్రీనివాస రెడ్డి , పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: