దర్శిలో రణరంగం- వైసిపి నేతల నామినేషన్ పత్రాలను చించేసిన టీడీపీ నేతలు- ఘర్షణలో వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలు- పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి ఆందోళన

దర్శి : దర్శిలో నామినేషన్ సందర్భంగా శనివారం నాడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వై సిపి నామినేషన్ పత్రాలను టీడీపి కార్యకర్తలు లాక్కొని చించివేశారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వైసిపి కార్యకర్తల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ చర్యలను నిరసిస్తూ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేశారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో బైఠాయించారు. పోలీసులు భారీగా మోహరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వైసీపీకి చెందిన 8 మంది వార్డు మెంబర్లు మున్సిపల్ కార్యాలయా నికి, సత్రాల బడిలో ఉన్న నామినేషన్ కేంద్రానికి శనివారం ఉదయం నామినేషన్ వేసేందుకు వెళ్లారు. సత్రాల బడి వద్దకు వెళ్లిన ముగ్గురు వార్డు మెంబర్ల నామినేషన్ పత్రాలను టిడిపి నేతలు లాక్కొని చించేశారు.

నామినేషన్ పత్రాలు చించేయడంతో ఆ అభ్యర్థులు వైసిపి కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లికి సమాచారం ఇచ్చారు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వైసిపి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డితో పాటు మిగతా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తో
కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. గడియార స్తంభం సెంటర్ వరకు వచ్చేసరికి.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీగా వద్దని.. ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని పంపిస్తే నామినేషన్ వేయిస్తామని పోలీసులు తెలిపారు. ఆ నలుగురూ మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోకి వచ్చేసరికి అక్కడ టిడిపికి సంబంధించిన వంద మందికి పైగా వైసిపి వాళ్లను అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టిడిపి నేతల దాడిలో వైసిపి కార్యకర్త తలకు , మరో ముగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి నామినేషన్ వేయకుండా తిరిగి వెనక్కి వచ్చారు. అప్పటికి సమయం 2 గంటలు దాటింది. దీంతో వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నామినేషన్ వేయలేదు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద బైటాయించి.. ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో నామినేషన్లు ఆపిన దాఖలాలు ఎప్పుడూ లేదని అన్నారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు.

దర్శిలో నామినేషన్ వేయడానికి భద్రత ఏది..?
దర్శిలో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు భద్రత కల్పించే అంశం చర్చకు వస్తోంది. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు స్వేచ్ఛగా చేరుకుని, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ పత్రాలను సమర్పించే వాతావరణం ఉండాలి. అయితే అక్కడ నామినేషన్ దాఖలు చేసేందుకు తగిన భద్రత లేదనే ఆరోపణలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు స్పందించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *