అగ్ని ప్రమాదంలో చేపలు పట్టే వలలు నష్టపోయిన మత్స్యకారు లు వేటకు వెళ్లలేనందున తక్షణ సాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తాం…… జిల్లా కలెక్టర్ పి రాజాబాబు….మత్స్యకారులను అన్ని విధాల ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…. కలెక్టర్ పి. రాజబాబు -ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద లబ్ధి చేకూరిలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…. కలెక్టర్ పి. రాజబాబు

కొత్తపట్నం మండలం కే .పల్లి పాలెం సముద్రతీరంలో రాత్రి జరిగిన అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారుల వలలను క్షేత్రస్థాయిలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన మత్స్యకారులకు నిత్యావసర సరుకులు సైక్లోన్ సందర్భంగా ఇచ్చే సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన వలలు విషయంలో అంచనా వేయవలసి ఉందని కాల పరిమితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియవలసిందని సమగ్ర విచారణ జరిపే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి చుట్ట చేయడం అల్లా అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు అన్నారు. వాస్తవాలు తెలుసుకోవలసి ఉందన్నారు. మత్స్యకారులు వలన దాచుకునే బిల్డింగ్స్ పూర్తిగా దెబ్బతిన్నందున వాటిని పునరుద్ధరణకై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రకాల సహాయాన్ని అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని దీనిపై సమగ్ర విచారణ చేపట్ట సమగ్ర విచారణ జరపవలసి ఉందని సంబంధిత పోలీస్ సూపరిండెంట్ కు సూచించడం జరిగింది అన్నారు. ప్రభుత్వం నుంచి అందవలసిన అన్ని రకాల సాయం అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో పలు విషయాలను అడిగి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *