ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు చెల్లించాలి

గ్రామాల్లోని ప్రతి ఒక్కరు ఇంటి పన్నులు చెల్లించాలని ఈ ఓ పి ఆర్ డి పి ఓబులేసు అన్నారు. మండలంలోని పులిపాడు గ్రామంలో గురువారం జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇంటికి తిరిగి పన్నులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటింటికి తిరిగి ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జె. రాజరాజేశ్వరి. బి అనిల్. వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *