వేద అకాడమీ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ పోటీలలో తాళ్లూరుకు చెందిన శ్రీ సరస్వతి హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జూనియర్ కేటగిరిలో 7వ తరగతి విద్యార్థిని జి మౌనిక రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, సీనియర్ కేటగిరీలో 8వ తరగతి విద్యార్థిని వి భార్గవి 2వ ర్యాంకు సాధిం చారు. హ్యాండ్ రైటింగ్ పోటీలలో స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థి నులను పాఠశాల చైర్మన్ ఏవి రమణారెడ్డి గురువారం పాఠశాల ఆవరణలో ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందించి అభినం దించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తి, రత్నం, వెంకటరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్ రైటింగ్ పోటీల్లో తాళ్లూరు విద్యార్థుల ప్రతిభ
17
Feb