స్వచ్ఛందంగా చెత్తను తొలగిస్తున్న మాజీ ప్రజా ప్రతినిధి- ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు –

ముండ్లమూరు మండల కేంద్రం నుండి చిలక లేరు వాగు వెళ్లే రోడ్డు మార్గంలో అద్దంకి దర్శి ఆర్ అండ్ బి రోడ్డు వెంబడి గ్రామస్తులు దుకాణదారులు కొంతకాలం నుండి చెత్తాచెదారం వేయడంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉండేది, ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సరే స్పందన లేదు, దీంతో నిత్యం ముండ్లమూరు లో తన వ్యాపార లావాదేవీలు సాగిస్తున్న తాళ్లూరు మండలం విఠలాపురం . రమణాలవారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పాలెపోగు విజయ రాజు దృష్టికి ఆయన మిత్రుడు బత్తిన సురేష్ తీసుకువెళ్లి చర్చించుకున్నారు, దీంతో స్పందించిన మాజీ సర్పంచ్ విజయరాజు ముందుకు వచ్చి తన జెసిబి తో చెత్త చేదారాన్ని తీసి ట్రాక్టర్ ట్రక్కు ద్వారా ఊరికి దూరంగా పడవేశారు, దీంతో ఆ ప్రాంతంలో దుర్వాసన బాధ తప్పినట్లు అయింది, ఈ దారిలో ప్రయాణం సాగించే గ్రామాలైన తమ్మలూరు. నాయుడుపాలెం. పెదరావిపాడు. ఉమా మహేశ్వర పురం. పూరిమెట్ల. భీమవరం. ఈ దర జమ్మలమడక. మక్కినేని వారిపాలెం. బొప్పూడి వారి పాలెం . స్థానిక గ్రామ ప్రజలు విఠలాపురం మాజీ సర్పంచ్ పాలెపోగు. విజయరాజును బత్తిన సురేష్ లను పలు గ్రామాలు ప్రజలు స్థానికులు అభినందించారు,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *