క్రీడాపోటీల్లో క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి స్నేహపూర్వక పోటీతత్వం ప్రదర్శించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. రాష్ట్ర స్థాయి వైఎస్సార్ – బీఎ స్సార్ క్రికెట్ కప్పు పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ డాక్టర్ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు మొదటి బహుమతి లక్ష రూపాయలు అందజేశారు.
ఈ పోటీల్లో అంజి ప్యంతేర్స్ మొదటి విజేత, సింహ లెవెన్స్ ద్వితీయ, బాబులెవెన్స్ తృతీయ, గణేష్ లెవెన్స్ నాలుగో విజే తగా నిలిచారు. ద్వితీయ బహుమతిగా రూ.60,000, తృతీయ బహుమతిగా రూ.40 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసా దరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వారికి నాయ
కులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దుశ్శా లువాలు, పూలమాలలతో సత్కరించారు. రాష్ట్ర షేక్ కార్పొ రేషన్ డైరెక్టర్ ఎస్. ఎం. బాషా, వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి ,సోషల్ మీడియా మండల అధ్యక్షుడు యరమల మధుసూదన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, గొల్ల ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





