తాళ్లూరు మండలంలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడార్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సంఘ నాయకులు ఎంపీడీఓ వై శ్రీనివాసరావు సోమవారం కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పటికే కొందరికి సంవత్సర కాలం పాటు వేతనాలు రావాల్సి ఉందని, మండలంలో 53 మంది గ్రీన్ అంబాసిడార్స్ ఉండగా ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. సంఘ నాయకులు రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు పెండిగ్ వేతనాలు చెల్లించాలని వినతి
15
May