రాష్ట్రంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా దర్శి మండలం సామంతపూడి నుండి టిడిపి కార్యాలయం వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం అయిందన్నారు. టిడిపి అధినాయకుడు చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంతో రాష్ట్రంలో పెను మార్పులు సంభవించాయన్నారు.రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం తద్యమన్నారు. రాష్ట్రంలో వైసిపి తీసుకువచ్చే చీకటి జీవోలన్ని వైసీపీ నాయకులకు వారి స్వార్థ ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నాయన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉందో వైఎస్ఆర్సిపి కి అర్థం అయిందన్నారు. జీవో నెంబర్ 1 కొట్టి వేయడం వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. దర్శి లో చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.
దర్శి లో టిడిపి నేతలు ప్రెస్ మీట్ కీలక వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు.
15
May