ముండ్లమూరు మండలంలోని వేంపాడులో ఆంజ నేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. అద్దంకి చెల్లించారు. దర్శి ప్రధాన రహదారిలో వేంపాడు వద్ద ఆంజ నేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ, ధ్వజ స్తంభం ఏర్పాటు కార్యక్రమాలు వేద పండితుల మంత్రో చ్ఛరణలతో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం చేశారు. ఆమె వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ల సంఘ మండల మాజీ అధ్య క్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బంకా నాగిరెడ్డి, యరబ్రోలు శ్రీనివా సరెడ్డి, వీరయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


