వడదెబ్బతో యువకుడు మృతి

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన దర్శి నియోజకవర్గంలో చోటుచేసుకుంది.. దర్శి లోని మెయిన్ బజార్లో నివాసం ఉంటున్న చెన్నూరి రమేష్ (36 సంవత్సరాలు) దర్శి లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉండేవాడు. మృతునికి భార్య ఓ కుమారుడు ఉన్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇదే మొదటిది కావడం చాలా బాధాకరం. భానుడి ప్రతాపంతో బాగా నీరసించిన రమేష్ కు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయి చివరికి ప్రాణాలు విడిచిన పరిస్థితి నెలకొంది. ఎండ పెట్టు ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *