యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనపై జరిగిన రాళ్ల దాడిలో గాయపడి మృతి చెందిన రాజయ్య మృతికి కారణం మంత్రి ఆదిమూలపు సురేష్ నే అంటూ టిడిపి జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మండిపడ్డారు. ఆరోజు ప్రశాంతంగా సాగుతున్న రోడ్ షోలో మంత్రి అనుచరులు రాళ్లు వేయడం వల్లే రాజయ్య మృతి చెందడం జరిగిందని నూకసాని ఆరోపించారు. దళితుల పట్ల కపట ప్రేమ చూపి దళితుల హత్యలకు కారకుడుగా మంత్రి సురేష్ ఉంటున్నారని నూకసాని ద్వజ మెత్తారు. రాజయ్య కుటుంబానికి సురేష్ క్షమాపణలు చెప్పాలని నూకసాని డిమాండ్ చేశారు. వెంటనే మంత్రిపై కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు రాజయ్య మృతదేహానికి నూకసాని బాలాజీ, ఉగ్ర నరసింహ రెడ్డి, ఏరీక్షన్ బాబు, నాగేశ్వరరావు లు నివాళులర్పించారు. మాజీ సీఎం చంద్రబాబు రాజయ్య కుటుంబానికి ఆర్ధిక సాయంగా రూ.10 లక్షలు ప్రకటించారని, దానిని జిల్లా అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, ఇంచార్జి గూడూరి ఏరీక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు లు రాజయ్య కుటుంబానికి అందించారు. కందుకూరు టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50వేలు రాజయ్య కుటుంబానికి అందజేశారు.
కార్యక్రమంలో డాక్టర్ నూకసాని బాలాజీ , టిడిపి ఇంచార్జ్ లు గూడూరి ఎరిక్షన్ బాబు , డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి ,
ఇంటూరి నాగేశ్వరరావు , టిడిపి నాయకులు పాల్గొన్నారు.

