దర్శనాపురి కళా పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నాటక పోటీలను జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన కళా పరిషత్తు వేదిక శిలాఫలకాన్ని తొలుత ప్రారంభించిన ఆమె అనంతరం అక్కడ జరిగే నాటక పోటీలకు శ్రీకారం చుట్టారు. వెంకాయమ్మ మాట్లాడుతూ కళా పరి షత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు కలువకొలను అనంత్, ఇతర సభ్యులు కళలకు విశే షంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. తొలిరోజు విజయవాడ న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆధ్వర్యంలో కపిరాజు, హైదరాబాద్ కళాంజలి ఆధ్వర్యంలో రైతేరాజు నాటికలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళా పరిషత్తు సభ్యులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నాటికలు వీక్షించారు.



