ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి నిధులతో నిర్మాణం చేయుచున్న కొర్రపాటి వారి పాలెం బస్ షెల్టర్ పై భాగంలో ఏర్పాటు చేసిన పలువురి పేర్లతోపాటు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీ పేరును కూడా చేర్చలేదని శివరాంపురం ఎంపీటీసీ అనపర్తి చిన పుల్లమ్మ , ఎంపీడీవో వై శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కేవలం తాను ఎస్సీ వర్గానికి చెందిన దాన్ని కాబట్టి తనను తక్కువగా చేస్తూ.. తన పేరు శాశ్వత బస్సు షెల్టర్ పై చేర్చలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిశీలించి తగి న్యాయం చేయాలని కోరారు.
