పరిపాలన వికేంద్రీకరణతో గ్రామ స్వరాజ్య స్థాపనకు నాంది పలికినది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ సమావేశపు మందిరంలో సోమవారం వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపనకు గ్రామ. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో గత నాలుగు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని అన్నారు. 50 కుటుంబాలకు అనేక వ్యవ ప్రయాసలకు ఓర్చి ఎండ అయినా వాన అయినా సరే, సెలవు అయినా సరే సేవలు అందిస్తున్నారని అన్నారు. వలంటీర్ల వ్యవస్థకు మైస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. వారికి అందించాల్సిన సంక్షేమ పథకాలను మరింతగా వారి చెంతకు చేర్చి మరింత వారధిగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో కార్పోరేట్ తరహా సచివాలయ, ఆర్బిక్, హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అందిస్తున్న సేవలు చక్కగా ఉన్నాయని అన్నారు. ఆయా గ్రామాలలో సంబంధిత భవనాలు చేసినప్పుడు, గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం తీసువచ్చిన మార్పులకు అడ్డం పడుతుందని హర్షం వ్యక్తం చేసారు. వలంటీర్లు ప్రజలకు నిత్యం సేవలు చెయ్యాలన్న తపనతో ఉన్నత చదువులు చదివిన వారు కూడ వలంటీర్ సేవలు అందించటం ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం సేవా రత్న, సేవ మిత్ర ఆవార్డులను, అందించి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ గోళ్లపాటి సుధా అచ్చయ్య, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, వైఎస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, కొరివి ముసలయ్య, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, కాల్సిలర్లు వీసీ రెడ్డి, మేడగం మోహన్ రెడ్డి, జెన్ఎఎస్ కన్వినర్ బత్తిన వెంకటేశ్వర్లు, సర్పంచిలు ఎం. వెంకటరెడ్డి, రామారావు, దాసరి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు, నాయకులు దారం వాసుదేవ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, యర్రయ్య, మిల్లరుజ్జి, వలంటీర్ల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. కరుణా నిధి. అధికారులు ఎంపీడీఓ కుసుమకుమారి, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, కమీషనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




