దివ్యాంగుల ఉచిత మోగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జి దేవ ప్రసాద్ కోరారు. స్థానిక ఆర్అంబ్బి అతిథి గృహం ఆవరణలో సోమవారం వైద్యశిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవ ప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో ఈనెల 26న వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జి గోపాల్ రెడ్డి
ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 5వ తేదిన సైజులు తీసుకున్న దివ్యాంగులు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయటం జరుగుతుందని చెప్పారు. అలాగే ఇతర దివ్యాంగులు కూడ తమ పరికరాల కోసం పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దొనకొండ, దర్శి మండల నాయకులు బ్రహ్మారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల మెడికల్ శిబిరంను సద్వినియోగం చేసుకోండి
22
May