రీ సర్వేలో అభ్యంతరాలు లేకుండా చూడాలి

గ్రామాల్లో జరుగుతున్న భూముల రి సర్వేలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సిబ్బంది పని చేయాలని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో భూములు కలిగిన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న రికార్డులు పరిశీలించి, రెవిన్యూ రికార్డులు పరిశీలించి రెండు సమానంగా ఉన్నట్లయితే వారికి వివరాలు తెలియజేయలన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ఛాయా చిత్రాల ఆధారంగా పొలం గెట్లు సరి చేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే రెవెన్యూ కార్యానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే టి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్, సీనియర్ అసిస్టెంట్ పి శేషగిరిరావు, మండల సర్వేయర్ శివ ప్రసాద్, వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *