బందోబస్తు నిమిత్తం రాజధాని ప్రాంతానికి వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పవనకుమార్ రాత్రి నిద్రిస్తున్న వేళ పాము కాటుకు గురైనాడు. వివరాలలోనికి వెలితే… తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఆర్-5 జోన్ వద్ద బందోబస్తు నిమిత్తం వెళ్లి సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడి క్రింద బాగంలో ఒక షేడ్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బుజం వద్ద ఎదోకుట్టినట్లు మెలుకువ రాగా, చేతితో దానికి విదిలించగా చేతి వెలుకు కూడ కరిచింది. దీంతో తోటి మిత్రులు లేచి పాముగా గుర్తించి చంపివేసారు. పొన్నూరు టౌన్ ఎస్సై హసీమ్ ఆద్వర్యంలో గుంటూరు వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ వైద్యశాలలో చేర్పించారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు ఎస్సైలు గుంటూరు వైద్యశాలకు వెళ్లి పవనకుమార్ ను పరామర్శించి పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేసారు. విష సర్పం మరింత బలంగా ఉండటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్స్ కు సరియైన వసతి ఏర్పాటు చేయక పోక పోవటంతో ఈ దుస్థితి ఏర్పడినదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

