బిజెపిలో దర్శి వాసులు చేరిక

దర్శి నగర పంచాయతీలోని శివాజీ నగర్ కు చెందిన పలువురు బిజెపిలో చేరారు. వైసిపి టిడిపిల నుండి బిజెపిలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు.నేడు పొదిలిలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శివాజీ నగర్ వాసులను పార్టీ కండువా కప్పి బిజెపి లోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, దర్శి నియోజకవర్గ అధ్యక్షులు మాడపాకుల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి పలువురు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *