ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జగనన్నతో చెబుతాం కార్యక్రమం

జగనన్నతో చెబుతాం కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం మరియు A.N.U పీజీ క్యాంపస్ నందు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ 1902 కాల్ చేసి జగనన్నతో చెప్పడం జరిగింది . ముఖ్యమంత్రి జగనన్న పాదయాత్రలో ఉన్నప్పుడు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు ఇంతవరకు నిధులు కేటాయించకపోగా అభివృద్ధి శూన్యంగా ఉంది . 2017లో చంద్రబాబు నాయుడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పి నిధులు కేటాయించకపోవడం వల్ల జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందుబాటులో వస్తది. ఉన్నత విద్యను అభ్యసించవచ్చు అని ఎంతో మంది విద్యార్థులు 2019 నుంచి ఎదురుచూసిన ఇంతవరకు విశ్వవిద్యాలయంలో నిధులు కేటాయించుకోవడం వల్ల హాస్టల్ వసతులు లేకపోవడం వల్ల యూనివర్సిటీలో 30 డిపార్ట్మెంట్ లకి హెచ్ ఓ డి నియమించి నాన్ టీచింగ్ స్టాప్ మరియు వసతులు కల్పించి విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థి హాస్టల్ భవనాలు ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరమే విశ్వవిద్యాలయం తరగతుల నిర్వహించాలని జగనన్నతో చెప్తా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ ….. ప్రకాశం జిల్లాలో 12 మంది శాసనసభ్యులు ఇద్దరు ఎంపీలు ఒక మంత్రి ఉండి కూడా విశ్వవిద్యాల ఏర్పాటు విషయంలో నాంచుడు ధోరణి ఎహరిస్తున్నారని గతంలో విశ్వవిద్యాలయం 20 సంవత్సరాల నుంచి ఏఎన్యూ పీజీ క్యాంపస్ పనిచేస్తున్న పర్మినెంట్ ప్రొఫెసర్లను కాదని రికమండేషన్తో సామాజిక న్యాయం పాటించకుండా వీసీ దగ్గరనుంచి ప్రొఫెసర్ల దాకా సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమ్ చంద్ర రెడ్డి , యూనివర్సిటీలో ప్రొఫెసర్ల సామాజిక న్యాయం పాటించకుండా చేయడం వల్ల ….. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరటానికి ఆసక్తి కూడా చూపటం లేదు. ప్రస్తుతం అయోమయంలో ఉద్యోగస్తులు ఉండటం వల్ల కొంతమంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున జీతాలు వస్తున్నాయి…. కొంతమంది ఉద్యోగస్తులకు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వల్ల జీతాలు వస్తాయని చూడడం వల్ల యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఏ యూనివర్సిటీ నుంచి జీతాల అని ఎదురుచూట్టం జరుగుతుంది . కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల్లో పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి 500 కోట్లు ప్రస్తుతం మంజూరు చేస్తే ఈ విద్యా సంవత్సరం కొనసాగే విధంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని విద్యార్థులకి హాస్టల్ భవనాలు నిర్మించి యూనివర్సిటీని పునర్వైభవానికి తెచ్చేందుకు కూడా వీలుంటుందని రాయపాటి జగదీష్ అన్నారు . జగనన్న చెప్తా కార్యక్రమంలో జగనన్న ప్రకాశం జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యచరణ తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరుణాకర్ జై భీమ్ యోజన విద్యార్థి సంఘ నాయకులు చిక్కాల కిరణ్ , విద్యార్థి జేఏసీ నగర అధ్యక్షులు కార్తీక్ , అవినాష్ , అశోక్ , అరుణ్ , రాము తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *