ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి స్థలంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి వారి నివాసాల్లో దీపాలు వెలిగిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని ఒకటో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటింటికీ తిరిగి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరిం చారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డు కౌన్సిలర్ మోహన్ బాబు దుశ్శాలువాలు, పూల మాలలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలి కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ మాట్లాడుతూ ….అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఎక్కువగా నివాసాలు, ఇళ్ల స్థలాలు అడుగుతున్నారని చెప్పారు. గత ఎన్నిక లకు ముందు చంద్రబాబు పాలన చూసిన ప్రజలు విసిగి వేసారి 23 సీట్లు ఇచ్చి ఆయన రాజకీయ జీవి తానికి సమాధి కట్టి సరైన బుద్ధి చెప్పారన్నారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని, ఇప్పటికీ బుద్ధిలేని మాటలే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల సొంతింటి కల నెరవేరుస్తూ వారి జీవితాల్లో వెలు గులు నింపుతుంటే సహించలేని చంద్రబాబు ఆ నివాసాలను శ్మశానాలతో పోల్చడం దుర్మా ర్గమన్నారు. 60 అడుగుల రోడ్లతో దర్శి నియోజకవ ర్గంలో జగనన్న కాలనీల్లో ప్రజలు సంతోషంగా నివా సాలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. చంద్ర బాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలే మళ్లీ సరైన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీ నర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికే షన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, వీసీరెడ్డి, తహశీల్దార్ శ్రావణ్ కుమార్, కమిషనర్ మహేష్ ,డీటీ రవి శంకర్, ఎస్సై రామకృష్ణ, ఏఈ ప్రసాద్, నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, హరీష్, జగన్, జయశింహారావు తదితర నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.


