వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలన సువర్ణాధ్యాయం -98 శాతం హామీలు అమలు పరిచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ -ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 175 సీట్లు పక్కా -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల నకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వచ్చే ఎన్ని కల్లో 175 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడం పక్కా అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొ న్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి మాట్లాడుతూ.. ఎన్నికల ఇచ్చిన హామీలలో 98 శాతం అమలు చేసిన సీఎం దేశ మొత్తం మీద ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రతిప క్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని మండి పడ్డారు. చంద్రబాబు పాలన గుర్తుకు వస్తేనే రైతులు, సామాన్య ప్రజలు భయాందోళనకు గురవు తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలన ఒక సువర్ణ అధ్యాయం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీ తంగా ప్రజలకు చేస్తున్న మేలు చిరస్థాయిగా గుర్తుం టుందన్నారు. మండల కన్వినర్ వెన్నపూస వెంకట రెడ్డి,గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ముండ్లమూరు ఎంపీపీ సునీతాబ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ లు సుబ్బారెడ్డి, అంకాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *