ఎన్ఎస్పీ స్థల ఆక్రమణదారుడిపై బైండోవర్

తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో ఎన్ఎస్పీ స్థలాన్ని ఆక్రమించి ఆక్రమంగా కట్టడాలు కడుతున్నారన్న ఫిర్యాదు మేరకు కుంచాల పోలిరత్నంపై బైండోవర్ కేసు నమోదు చేసి నట్లు ఎన్ఎస్పీ ఏఈ పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. తూర్పు గంగవరం గ్రామం లోని దర్శివెళ్లే మార్గంలో పెట్రోల్ బంక్ ఎదురుగా వున్న ఎన్ఎస్పీ స్థలం సర్వే నంబర్ లోని 114/3/బీలో కొంత స్థలాన్ని గ్రామానికి చెందిన కుంచాల పోలిరత్నం ఆక్రమించి కట్టడాలు కడుతున్నారన్న పిర్యాధు మేరకు పరిశీలించటం జరిగిందన్నారు. పరిశీలనలో ఆక్రమణ స్థలం ఎన్ ఎస్పీదిగా గుర్తించామన్నారు. గతంలో ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వు లు కూడా వున్నాయని తెలిపారు. ఎన్ఎస్పీకి చెందిన స్థలం ఆక్రమించి కట్టడాలు చేపట్టినందుకు బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *