తిరుమల శ్రీవారిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ బుధవారం వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు స్వామివారి ఆశీస్సులు పొందారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి నాలుగు వసంతాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి దయతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. స్వామివారి చల్లని దీవెనలతో 2024 లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాలని స్వామివారిని కోరుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
24
May